బైక్‌, సెల్‌ఫోన్‌ దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2023-08-02T00:24:49+05:30 IST

నగరంలోని టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గత నెల 31న శాంతినగర్‌ సమీపంలో ఓ వ్యక్తి నుంచి బైకుతో పాటు సెల్‌ఫోన్‌ను లాక్కుని వెళ్లిన వ్యక్తులను అరెస్టు చేశామని టూటౌన్‌ ఎస్‌ఐ లక్ష్మీప్రసన్నకుమార్‌ మంగళవారం తెలిపారు.

 బైక్‌, సెల్‌ఫోన్‌ దొంగల అరెస్టు

విజయనగరం క్రైం: నగరంలోని టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గత నెల 31న శాంతినగర్‌ సమీపంలో ఓ వ్యక్తి నుంచి బైకుతో పాటు సెల్‌ఫోన్‌ను లాక్కుని వెళ్లిన వ్యక్తులను అరెస్టు చేశామని టూటౌన్‌ ఎస్‌ఐ లక్ష్మీప్రసన్నకుమార్‌ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శాంతినగర్‌ కు చెందిన డి.విజయ్‌కుమార్‌ అనే వ్యక్తి గత నెల 31న తన కాలనీకి సమీపంలో ఇంటికి వెళ్తుండగా, నగరానికి చెందిన ఆల్తి జగదీష్‌, చెన్నా రాజేష్‌, గొర్లె మోహన్‌ అనే ముగ్గురు వ్యక్తులు అటకాయించి అతని వద్దనున్న బైకును, సెల్‌ఫోన్‌ని లాక్కొని పరారయ్యారు. విజయ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం మండపాం జంక్షన్‌లో వాహనాలు తనిఖీ చేస్తుం డగా జగదీష్‌, రాజేష్‌, మోహన్‌లు అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపు లోకి తీసుకున్నారు. స్టేషన్‌కి తరలించి విచారించగా, నేరాన్ని అంగీకరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ ప్రసన్నకుమార్‌ తెలిపారు.

Updated Date - 2023-08-02T00:24:49+05:30 IST