దేవస్థానానికి బయలుదేరితే అరెస్టులా?
ABN , First Publish Date - 2023-09-23T00:10:38+05:30 IST
చంద్రబాబు మంచిని కోరుతూ బొబ్బిలి నుంచి సింహాచలం దేవస్థానం వరకు బేబీనాయన తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం దారుణమని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అన్నారు.
- టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు
విజయనగరం రూరల్, సెప్టెంబరు 22: చంద్రబాబు మంచిని కోరుతూ బొబ్బిలి నుంచి సింహాచలం దేవస్థానం వరకు బేబీనాయన తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం దారుణమని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేవస్థానానికి బయలుదేరితే అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇంటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలను గృహనిర్బంధించడం నియంతపాలనను తలపిస్తోందన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా దీనిని ఖండించాలని పిలుపునిచ్చారు.
తెలుగుమహిళా నేతల వినూత్న నిరసన
విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు తెలుగుమహిళా నేతలు గులాబీ పువ్వులు అందించి వినూత్నంగా నిరసన తెలిపారు. బేబినాయన పాదయాత్రను అడ్డుకోవడంతో పాటు టీడీపీ నాయకులను ఎక్కడికక్కడే గృహ నిర్బంధించడాన్ని ఖండిస్తూ తెలుగు మహిళా నాయకులు కొర్నాన రాజ్యలక్ష్మి, పత్తిగిల్లి సూర్యకుమారి, కర్రోతు రాధామణి, చెన్నా రూపావాణి, ఇందుకూరి లక్ష్మి పోలీసులకు పువ్వులు ఇచ్చి నిరసన తెలిపారు. ఇందుకూరి లక్ష్మీ కంటతడి పెట్టారు.