‘నేతన్న నేస్తం’కు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2023-06-13T00:07:45+05:30 IST
వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా చేనేత, జౌళ్లశాఖ అధికారి ఐ.ధర్మారావు సోమవారం ఒక ప్రకటనతో తెలిపారు.
పార్వతీపురం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా చేనేత, జౌళ్లశాఖ అధికారి ఐ.ధర్మారావు సోమవారం ఒక ప్రకటనతో తెలిపారు. సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులు, దార్రిద్య రేఖకు దిగువున ఉన్న వారికి ఈ పథకం కింద ఏడాదికి రూ.24 వేలను ఆర్థిక సహాయంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులు ఈ నెల 20లోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 28 నుంచి 29 వరకు సచివాలయాల్లో లబ్ధిదారుల వివరాలను ప్రదర్శిస్తామని, వాటిని గమనించాలని తెలిపారు. కుటుంబానికి ఒక్క చేనేత మగ్గానికి మాత్రమే ఆర్థిక సహాయం లభిస్తుందన్నారు.