Share News

ప్రతి మండలంలోనూ అన్నా క్యాంటీన్‌

ABN , First Publish Date - 2023-11-22T00:13:54+05:30 IST

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు శృంగవరపుకోట/ లక్కవరపుకోట, నవంబరు 21: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్‌ పేరుమీద నియోజకవర్గ కేంద్రాలతో పాటు అవసరమైతే ప్రతి మండలంలోనూ అన్నా క్యాంటీన్‌లను తెరుస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

ప్రతి మండలంలోనూ అన్నా క్యాంటీన్‌
ఎస్‌.కోట అన్నక్యాంటీన్‌ వద్ద పేదలకు భోజనం వడ్డిస్తున్న టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు

ప్రతి మండలంలోనూ అన్నా క్యాంటీన్‌

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు

శృంగవరపుకోట/ లక్కవరపుకోట, నవంబరు 21: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్‌ పేరుమీద నియోజకవర్గ కేంద్రాలతో పాటు అవసరమైతే ప్రతి మండలంలోనూ అన్నా క్యాంటీన్‌లను తెరుస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శృంగవరపుకోట పుణ్యగిరి రోడ్డులోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పలరామప్రసాద్‌లు ఏర్పాటు చేసిన అన్నాక్యాంటీన్‌ 111రోజులకు చేరుకున్న సందర్భంగా అయ్యన్న మంగళవారం కేక్‌ కట్‌ చేశారు. అనంతరం భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్‌లను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. పేదల కడుపునింపిన అన్నాక్యాంటీన్‌లను వైసీపీ ప్రభుత్వం మూసేసింద న్నారు. పేదల పక్షపాతినని చెబుతూనే సీఎం జగన్‌రెడ్డి పేదల నోటివద్దకు వచ్చిన అన్నాన్ని పడగొట్టారని, జగన్‌కు రానున్న ఎన్నికల్లో రాజకీయ సమాధి కట్టాలని కోరారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 90 చోట్ల సొంత నిధులతో టీడీపీ అన్నాక్యాంటీన్‌లను నిర్వహిస్తోందన్నారు. జనసేన నియోజకవర్గ సమన్వయ కర్త ఒబ్బిన సత్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు జీఎస్‌ నాయుడు, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, మాజీ వైస్‌ ఎంపీపీ నానిగిరి రమణాజీ, నాయకులు కొణదం మల్లేశ్వరరావు, కాపుగంటి వాసు, చెక్క కిరణ్‌, జనసేన నాయకుడు ఒబ్బిన సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.

‘జగన్‌కు రాజకీయ సమాధి కట్టండి’

సైకో జగన్మోహన్‌రెడ్డికి రాజకీయ సమాధి కట్టాలని, లేదంటే రాష్ట్ర భవిష్యత్‌ నాశనమవుతుందని టీడీపీ సీనియర్‌ నేత పొలిట్‌ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎల్‌.కోటలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇంటివద్ద మంగళవారం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. అన్నాక్యాంటీన్‌లను ఎత్తేయడం దారుణమని, పేదలకు ఐదు రూపాయలకు అన్నం పెట్టడం తప్పా అంటూ ప్రశ్నించారు. కేసుల నుంచి కాపాడుకోవడం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ఢిల్లీలో రాష్ట్రం పరువు పోయేలా వంగివంగి సాష్టాంగ నమస్కారాలు చేసున్నారని ఎద్దేవాచేశారు. 18 సార్లు ఢిల్లీ వెళ్లి ఎం ఊడపీకావని ప్రశ్నించారు. రాష్ట్రనికి రైల్వేజోన్‌ తెచ్చావా?.. ప్రత్యేక హోదా సాధించావనా, వైజాగ్‌కి మెట్రో రైలు ప్రాజెక్టు తెచ్చావనా, పోలవరం పూర్తిచేసేవనా ఎందుకు ఈ రాష్ట్రానికి నీ అవసరమని మండిపడ్డారు. బ్రిటీష్‌ వారిని ఎదిరిచినట్లు జగన్‌ను ఎదిరించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. కోళ్ల కుటుంబం ఈ నియోజకవర్గ ప్రజలకు యాబై ఏళ్లుగా సేవ చేస్తున్నారని, వారిని ఆదరించాలని కోరారు. సమావేశంలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేమీఏ రాంప్రసాద్‌, జనసేన సమన్వయకర్త వి.సత్యనారాయణ, జయప్రకాశ్‌బాబు, తెలుగురైతు తిక్కాన చినదేముడు తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2023-11-22T00:13:57+05:30 IST