కదంతొక్కిన అంగన్‌వాడీలు
ABN , First Publish Date - 2023-02-07T00:01:00+05:30 IST
అంగన్‌వాడీలు కదంతొక్కారు. తాము ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలపై పోరుబాట పట్టారు. ఒకేసారి జిల్లా కేంద్రానికి వందలాదిగా తరలివచ్చి ధర్నాకు దిగారు. గ్రాడ్యూటీ ఇవ్వాలని, కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఫేస్‌యాప్ హాజరు వద్దని నినాదాలు చేశారు. కలెక్టరేట్ వద్దకు సోమవారం ఉదయం నుంచే గుంపులుగా అంగన్‌వాడీలు, ఆయాలు చేరుకున్నారు.

గ్రాట్యూటీ ఇవ్వాలని డిమాండ్
కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని నినాదాలు
విజయనగరం (ఆంధ్రజ్యోతి)
అంగన్‌వాడీలు కదంతొక్కారు. తాము ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలపై పోరుబాట పట్టారు. ఒకేసారి జిల్లా కేంద్రానికి వందలాదిగా తరలివచ్చి ధర్నాకు దిగారు. గ్రాడ్యూటీ ఇవ్వాలని, కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఫేస్‌యాప్ హాజరు వద్దని నినాదాలు చేశారు. కలెక్టరేట్ వద్దకు సోమవారం ఉదయం నుంచే గుంపులుగా అంగన్‌వాడీలు, ఆయాలు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో చేరుకున్నాక ఆందోళన చేపట్టారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోయేషియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.పైడిరాజు, ఎస్.అనసూయ మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లలో పేద గర్భిణులు, బాలింతలకు, చిన్నపిల్లలకు సేవలు అందిస్తున్నామని, మౌలిక సదుపాయలు లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లగా టీఏ, డీఏలు చెల్లించలేదన్నారు. వైఎస్సాఆర్ సంపూర్ణ పోషణ పథకం అమలుకు కొన్ని ప్రాజెక్టుల్లో ఆరు నెలల నుంచి నిధులు చెల్లించడంలేదన్నారు. గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉండటంలేదని, అంగన్వాడీలకు ఇచ్చిన మొబైల్‌ఫోన్ సరిగా పనిచేయక ఫేస్‌యాప్ హాజరు కష్టమవుతోందన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్, బీమా, సర్వీసులో ఉంటూ చనిపోయిన కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ధర్నాలో సంఘం నాయకులు వి.లక్ష్మీ, టవీ రమణ, కృష్ణమ్మ, వరలక్ష్మీ, రమణమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.