టోల్‌ప్లాజ్‌కు భూములివ్వండి: ఆర్డీవో

ABN , First Publish Date - 2023-06-03T00:27:16+05:30 IST

విజయనగరం నుంచి ఎస్‌.కోటకు వెళ్లే రహదారిలో గంట్యాడ గ్రామ సమీపంలో ఏర్పాటుచేస్తున్న టోల్‌ప్లాజ్‌కు భూము లు ఇవ్వాలని ఆయా రైతులకు ఆర్డీవో సూర్యకళ సూచించారు.

 టోల్‌ప్లాజ్‌కు భూములివ్వండి: ఆర్డీవో

గంట్యాడ: విజయనగరం నుంచి ఎస్‌.కోటకు వెళ్లే రహదారిలో గంట్యాడ గ్రామ సమీపంలో ఏర్పాటుచేస్తున్న టోల్‌ప్లాజ్‌కు భూము లు ఇవ్వాలని ఆయా రైతులకు ఆర్డీవో సూర్యకళ సూచించారు. టోల్‌ప్లాజ్‌ ఏర్పాటుచే యనున్న ప్రాంతాన్ని ఆమె శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈసందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారి విస్తరణ కోసం తాము భూము లు ఇచ్చామని, కానీ టోల్‌ప్లాజ్‌కు మాత్రం ఇచ్చే భూములకు పరిహారం పెంచాలని రైతులు కోరారు. ముందుగా భూములు ఇస్తే తర్వాత పరిహారం పెంచడానికి ఉన్న తాధికారులకు లేఖ రాస్తామని ఆమె చెప్పారు. గత కొద్ది రోజుల కిందట కొర్లాం రింగురోడ్డుకు భూములు ఇచ్చే రైతులకు వారి కోరిక మేరకు పరిహారం పెంచడం కోసం ఉన్నతాధికారులను లేఖలు రాశామని, ఇక్కడి రైతులకు వివరించారు. అదే తరహాలో ఇక్కడ కూడా ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీ ల్దార్‌ ప్రసన్నరాఘవ, డిప్యూటీ తహసీల్దార్‌ స్వర్ణకుమార్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:27:16+05:30 IST