Share News

అభివృద్ధికి చోదకశక్తిగా ఎయిర్‌పోర్టు

ABN , First Publish Date - 2023-11-21T00:07:20+05:30 IST

జిల్లా అభివృద్ధికి చోదకశక్తి(గ్రోత్‌ ఇంజన్‌)గా భోగాపురం అంతర్జాతీయ విమాశ్రయం నిలుస్తుందని, రానున్న రోజుల్లో దీని కేంద్రంగానే అభివృద్ధి అంతా ఉంటుందని కలెక్టర్‌ నాగలక్ష్మి చెప్పారు. నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో గ్రోత్‌ హబ్‌లపై విశాఖపట్టణంలో వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో సోమవారం విశాఖ పరిసర ప్రాంత జిల్లాల కలెక్టర్లతో సమావేశం జరిగింది.

అభివృద్ధికి చోదకశక్తిగా ఎయిర్‌పోర్టు
మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

అభివృద్ధికి చోదకశక్తిగా ఎయిర్‌పోర్టు

నీతి ఆయోగ్‌ సమావేశంలో కలెక్టర్‌ నాగలక్ష్మి

కలెక్టరేట్‌, నవంబరు 20: జిల్లా అభివృద్ధికి చోదకశక్తి(గ్రోత్‌ ఇంజన్‌)గా భోగాపురం అంతర్జాతీయ విమాశ్రయం నిలుస్తుందని, రానున్న రోజుల్లో దీని కేంద్రంగానే అభివృద్ధి అంతా ఉంటుందని కలెక్టర్‌ నాగలక్ష్మి చెప్పారు. నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో గ్రోత్‌ హబ్‌లపై విశాఖపట్టణంలో వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో సోమవారం విశాఖ పరిసర ప్రాంత జిల్లాల కలెక్టర్లతో సమావేశం జరిగింది. కలెక్టర్‌ నాగలక్ష్మి విజయనగరం జిల్లాలో అభివృద్ధికి గల అవకాశాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనేక ఇతర రంగాల్లోనూ రానున్న కాలంలో అభివృద్ధి వేగంగా ఉంటుందన్నారు. ఉద్యాన పంటలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా జిల్లాలో ఆ పంటల విస్తీర్ణం పెంచుతున్నామని, ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

- జిల్లాలో ప్రాధాన్యతా భవనాల నిర్మాణాన్ని వచ్చే నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మండల స్థాయి అధికారులతో సోమవారం సాయంత్రం ఆమె మాట్లాడారు. గృహ నిర్మాణ లేఅవుట్లలో ప్రత్యేకాధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులు పర్యటించాలని, లబ్ధిదారులతో మాట్లాడి వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. లేఅవుట్లలో నీటి సరఫరా, విద్యుత్‌ సరఫరాను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ మయూర్‌అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-21T00:07:22+05:30 IST