ఆహా.. క్యాంటీన్ మూసేశారు..
ABN , First Publish Date - 2023-11-21T00:10:29+05:30 IST
రాజాం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే జోగులు చేతులమీదుగా ఆగస్టు 28న ఆర్భాటంగా ప్రారంభించిన ఆహా క్యాంటీన్ మూతపడింది. ఇష్టం లేకపోయినా.. నష్టం వస్తున్నా అధికారుల ఒత్తిడిని కాదనలేని పరిస్థితుల్లో నిర్వాహకులు నెలరోజుల పాటు కొన్ని ఆహార పదార్థాలు తెచ్చిపెట్టి విక్రయించారు.

ఆహా.. క్యాంటీన్ మూసేశారు..
ఆరంభ ఆర్భాటమే
రాజాం రూరల్, నవంబరు 20: రాజాం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే జోగులు చేతులమీదుగా ఆగస్టు 28న ఆర్భాటంగా ప్రారంభించిన ఆహా క్యాంటీన్ మూతపడింది. ఇష్టం లేకపోయినా.. నష్టం వస్తున్నా అధికారుల ఒత్తిడిని కాదనలేని పరిస్థితుల్లో నిర్వాహకులు నెలరోజుల పాటు కొన్ని ఆహార పదార్థాలు తెచ్చిపెట్టి విక్రయించారు. ఆపై పూర్తిగా విడచిపెట్టడంతో పట్టణానికి చెందిన ఓ మహిళతో పదిరోజుల పాటు కూరలు, రసం, సాంబారు వంటివి పెట్టి మమ అనిపించారు. ఆమె సైతం తన వల్ల కాదని చేతులెత్తేయడంతో ఆహా క్యాంటీన్ నిర్వహణుకు మంగళం పాడేశారు. ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ కృష్ణారావు వద్ద ప్రస్తావించగా.. నిర్వహణకు ఎవరూ ముందుకు రావడం లేదని, దీంతో మూసివేయాల్సి వచ్చిందని చెప్పారు.
----------