పరిహారం కోసం హైవే రైతుల ఆందోళన
ABN , Publish Date - Dec 23 , 2023 | 12:58 AM
విశాఖ-అ రుకు జాతీయ రహదారి 526బీ బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూము లు కోల్పోయిన రైతులు శుక్రవారం కొత్తవలస తహసీల్దార్ కార్యాల యం ఎదుట ఆందోళన చేపట్టారు. అఖిల భారత రైతు సంఘం నా యకులు డేగల అప్పలరాజు ఆధ్వర్యంలో సుమారు 600 మంది రైతుల తమ భవి ష్యత్ తేల్చాలని కోరారు
లక్కవరపుకోట (కొత్తవల స), డిసెంబరు 22: విశాఖ-అ రుకు జాతీయ రహదారి 526బీ బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూము లు కోల్పోయిన రైతులు శుక్రవారం కొత్తవలస తహసీల్దార్ కార్యాల యం ఎదుట ఆందోళన చేపట్టారు. అఖిల భారత రైతు సంఘం నా యకులు డేగల అప్పలరాజు ఆధ్వర్యంలో సుమారు 600 మంది రైతుల తమ భవి ష్యత్ తేల్చాలని కోరారు. అనంతరం ఆర్డీఓ సూర్యకుమారి తహసీల్దార్ శ్రీనివాస మిత్రతో కలిసి ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు. ఆర్డీవో మాట్లాడుతూ బైపాస్ రోడ్డు మండలంలో సుమారు 150 ఎకరాల్లోంచి వెళు తుందన్నారు. ఈ మార్గంలో సుమారు 600 మంది రైతులు భూములు, ఇళ్ల స్థలా లు, ఇళ్లు, షెడ్లు వివిధ రకాల నిర్మాణాలు కోల్పోతున్నారని తెలిపారు. దీనికి సం బంధించిన పరిహారం కోసం 3డీ నోటిఫికేషన్ అనంతరం నష్టపరిహారాన్ని నిర్ణయి స్తామని తెలిపారు. సుమారు 150 అడుగుల వెడల్పు గల జాతీయ రహదారి విస్తరణలో రీహేబిటేషన్‌కు అవకాశం లేదన్నారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న నిర్మా ణాలకు పరిహారం లేదన్నారు. జిరాయితీ భూములకు రెండు రెట్లు పరిహారం ఇస్తామని చెప్పారు. నోటిఫికేషన్ జారీలో తప్పులు ఉన్నాయని... సరైన గైడ్‌లైన్స్ లేవని రైతులు ఆర్డీవో ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ పరిష్కరించాకే రెండో నోటిఫికేషన్ ఇస్తామని ఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయ కులు డేగల అప్పలరాజు, చింతలపాలెం, ఎంఆర్.పురం, వి.బి.పురం, ఉత్తరాపల్లి తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.