ట్రాక్ పునరుద్ధరణకు చర్యలు
ABN , First Publish Date - 2023-08-22T00:05:39+05:30 IST
విజ యనగరం ఆర్టీవో కార్యా లయ పరిధిలో లైసెన్సు పరీక్షలు నిర్వహించే ట్రా క్ పునరుద్ధరణకు అధికా రులు ప్రయత్నాలు ము మ్మరం చేశారు.
విజయనగరం క్రైం, ఆగస్టు 21: విజ యనగరం ఆర్టీవో కార్యా లయ పరిధిలో లైసెన్సు పరీక్షలు నిర్వహించే ట్రా క్ పునరుద్ధరణకు అధికా రులు ప్రయత్నాలు ము మ్మరం చేశారు. సోమ వారం ఆ ట్రాక్‌ను రవా ణా శాఖాధికారులు రమణ, రమేష్, ఐశ్వర్యలక్ష్మి తది తరులు పరిశీలించారు. మరమ్మ తులకు గురైన రహదారిని పరిశీలించారు. ఈ నెల 20న ‘ఆంధ్ర జ్యోతిలో’ ‘ఇదేమి ట్రాక్ ’.. శీర్షికతో కథనం ప్రచు రించిన సంగతి తెలిసిందే. ఈ కథనంపై కలెక్టర్ నాగలక్ష్మి స్పందించారు. రవాణా శాఖ ఉప కమిషనర్ రవీంద్రనాథ్‌తో సోమవారం మాట్లాడారు.. కొత్త ట్రాక్ ఏర్పాటు చేసే వరకూ పాత ట్రాక్‌ను పునరు ద్ధరించాలని ఆదేశించారు. ట్రాక్‌కు వెళ్లే రహదారిని కూడా సరిచేయాలని సూచించారు. దీంతో రవాణాశాఖాధి కారులు ట్రాక్‌ను, రహదారిని పరిశీలించారు. తాత్కాలికంగా చేపట్టాల్సిన పనుల పై చర్చించారు. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించాలని, కొత్త ట్రాక్ పనులు వీలైనంత వేగంగా ప్రారంభించి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.