కట్నం కోసం హింసిస్తే చర్యలు

ABN , First Publish Date - 2023-09-26T00:09:31+05:30 IST

జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో అదనపు కట్నం కోసం హింసించే వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ దీపికా పాటిల్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో 40 ఫిర్యాదులు స్వీకరించారు.

కట్నం కోసం హింసిస్తే చర్యలు

విజయనగరం క్రైం, సెప్టెంబరు 25: జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో అదనపు కట్నం కోసం హింసించే వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ దీపికా పాటిల్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో 40 ఫిర్యాదులు స్వీకరించారు.

ఫ భోగాపురానికి చెందిన మహిళ ఎస్పీ దీపికకు ఫిర్యాదు చేస్తూ తనకు 2022లో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వ్యక్తితో వివాహమైందని... భర్త, బంధువులు తనను అదనంగా కట్నం తీసుకురమ్మని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఆమె విచారణ చేపట్టి ఫిర్యాదికి న్యాయం చేయాలని దిశ సీఐని ఆదేశించారు. ఫ విజయనగరం మండల పరిధిలోని గొల్లల పేటకు చెందిన వ్యక్తి ఎస్పీ దీపికకు ఫిర్యాదు చేస్తూ తాను ఒక స్థలం కొనుగోలు నిమిత్తం సారిక గ్రామానికి చెందిన వ్యక్తికి రూ.9 లక్షల 50 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చా నని... స్థలాన్ని రిజిస్టర్‌ చేయకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరానని తెలిపారు. ఆ వ్యక్తి డబ్బులో కొన్ని దొంగ నోట్లు కలిపి తనకి ఇచ్చి అగ్రిమెంటు తీసు కువెళ్లారని, న్యాయం చేయాలని కోరారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని విజ యనగరం డీఎస్పీ గోవిందరావును ఆదేశించారు.

ఫ డెంకాడ మండలం జొన్నాడకు చెందిన వ్యక్తి ఎస్పీ దీపికకు ఫిర్యాదు చేస్తూ, తాను ఇంజనీరింగ్‌ చదువుతున్నానని... తన రూంలో ల్యాప్‌టాప్‌ పోయిందని, న్యా యం చేయాలని కోరారు. స్పందించిన ఆమె విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డెంకాడ ఎస్‌ఐని ఆదేశించారు. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి తీసుకున్న చర్య లను నివేదించాలని, సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ కార్య క్రమంలో ఏఎస్పీ ఆష్మాపరహీన్‌, సీఐలు మురళి, విజయనాథ్‌, నర్సింహమూర్తి, ఎస్‌ఐలు వాసుదేవ్‌, ప్రభావతి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:09:31+05:30 IST