ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తులు స్వీకరణ
ABN , First Publish Date - 2023-05-23T23:52:59+05:30 IST
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం విడు దల చేసిన మార్గదర్శకాల ప్రకారం బుధవారం నుంచి 26 తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
కలెక్టరేట్, మే 23: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం విడు దల చేసిన మార్గదర్శకాల ప్రకారం బుధవారం నుంచి 26 తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 25 నుంచి 27 వరకూ ధ్రువ పత్రాల పరిశీలన, 28 నుంచి 29 వరకూ ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో ప్రదర్శి స్తా రు. 30న అభ్యంతరాల స్వీకరణ, ఈనెల 31, జూన్ 1న అభ్యంతరాలు పరిశీలన, జూన్ 2,3 తేదీల్లో తుది జాబితా, జూన్ 4న పోస్టులు ఖాళీలు జాబితా ఏర్పాటు చే యనున్నారు. 5,6 తేదీల్లోప్రధానోపాధ్యాయులకు, 5 నుంచి 7 తేదీల్లో స్కూల్ అసి స్టెంట్లకు, 5 నుంచి 8 తేదీ వరకూ ఎస్‌జీటీలు వెబ్ ఆప్షన్ కోసం పెట్టుకోవాలని డీఈవో లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. 9న జాబితా జనరేషన్ చేస్తామన్నారు.