పార్వతీపురం కలెక్టరేట్‌లో ‘స్పందన’ రద్దు
ABN , First Publish Date - 2023-03-05T00:10:48+05:30 IST
కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ‘స్పందన’ కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
పార్వతీపురం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ‘స్పందన’ కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో అధికారులు భాగస్వాములై ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లావాసులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అర్జీలు అందించేందుకు ఎవరూ కలెక్టరేట్‌కు రావొద్దని తెలిపారు.