యువకుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2023-05-21T00:13:31+05:30 IST

ప్రేమించిన అమ్మాయి పోలీసుస్టేషన్‌లో తనపై ఫిర్యాదు చేసిందని మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

యువకుడి ఆత్మహత్యాయత్నం

పార్వతీపురంటౌన్‌: ప్రేమించిన అమ్మాయి పోలీసుస్టేషన్‌లో తనపై ఫిర్యాదు చేసిందని మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఔట్‌పోస్టు పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం.. మండలంలోని తేలునాయుడువ లస గ్రామానికి చెందిన దినేష్‌, అదే మండలంలో వేరే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఇరు కుటుంబాలవారు ప్రేమించుకోవడానికి ఒప్పుకోకపోవడంతో పాటు అమ్మాయి తరపువారు పోలీసుస్టేషన్‌లో దినేష్‌పై ఫిర్యా దు చేశారు. దీంతో శనివారం తన నివాసంలో ఉన్న చీమలమందు తాగి ఆత్మహ త్యా యత్నానికి పాల్పడ్డాడు. జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్సను అందిస్తున్నారు.

Updated Date - 2023-05-21T00:13:31+05:30 IST