కదిలిన మహిళా లోకం

ABN , First Publish Date - 2023-09-18T00:33:24+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మద్దతుగా మహిళా లోకం కదిలింది. ఆయన అరెస్టును ఖండిస్తూ ఆదివారం జిల్లాలో పలుచోట్ల నిరసనలు తెలిపారు. నోటికి నల్లరిబ్బన్లు కట్టుకొని మౌనదీక్ష చేశారు.

   కదిలిన మహిళా లోకం
ఎస్‌.కోట పట్టణంలోని విజయనగరం రోడ్డులో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తున్న మహిళలు

- నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని మౌన దీక్ష

- టీడీపీ అధినేతను విడుదల చేయాలని డిమాండ్‌

( విజయనగరం-ఆంధ్రజ్యోతి)

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మద్దతుగా మహిళా లోకం కదిలింది. ఆయన అరెస్టును ఖండిస్తూ ఆదివారం జిల్లాలో పలుచోట్ల నిరసనలు తెలిపారు. నోటికి నల్లరిబ్బన్లు కట్టుకొని మౌనదీక్ష చేశారు. చంద్రబాబు ఆరోగ్యం ఉండాలని కోరుతూ వివిధ చర్చిల్లో ప్రార్థనలు చేశారు. విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, ఎస్‌కోట, రాజాం నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు రిలే నిరహార దీక్షలు చేశారు. ఆయన్ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా బెదిరేదిలేదన్నారు. అక్రమ అరెస్టులతో భయపెట్టలేరన్నారు. త్వరలో చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. అప్పటి వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-18T00:33:24+05:30 IST