బారామణి గ్రామానికి రోడ్డు నిర్మించాలి
ABN , Publish Date - Dec 30 , 2023 | 12:19 AM
నీలకంఠాపురం బీటీ రోడ్డు నుంచి డి.బారామణి గ్రామా నికి రోడ్డు నిర్మించాలంటూ సీపీఎం శ్రేణులు శుక్రవారం నీలకంఠాపురం వెళ్లే రహ దారిలో ధర్నా నిర్వహించాయి.
కురుపాం రూరల్: నీలకంఠాపురం బీటీ రోడ్డు నుంచి డి.బారామణి గ్రామా నికి రోడ్డు నిర్మించాలంటూ సీపీఎం శ్రేణులు శుక్రవారం నీలకంఠాపురం వెళ్లే రహ దారిలో ధర్నా నిర్వహించాయి. దశాబ్దాల కాలంగా డిమాండ్ చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదంటూ సీపీఎం నాయకులు రెడ్డి వేణు, మం డంగి రమణ, కోలక అవినాష్, గంగునాయుడు దుయ్యబట్టారు. రోడ్డును తక్షణం మంజూరు చేయకపోతే జనవరి 8వ తారీఖున ఐటీడీఏను ముట్టడిస్తామన్నారు.