హైదరాబాద్‌లో జిల్లా వాసి మృతి

ABN , First Publish Date - 2023-06-26T00:20:42+05:30 IST

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని విక్రంపురం గ్రామానికి చెందిన కలిశెట్టి జగదీష్‌ (36) అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

   హైదరాబాద్‌లో జిల్లా వాసి మృతి

కొమరాడ: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని విక్రంపురం గ్రామానికి చెందిన కలిశెట్టి జగదీష్‌ (36) అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జగదీష్‌ హైదరాబాద్‌లోని ఎన్‌సీఎల్‌ కర్మాగారంలో పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై కర్మాగారానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో జగదీష్‌ అక్కడికక్కడే మృతి చెందారు. జగదీష్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. జగదీష్‌ మృతితో విక్రంపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం విక్రంపురం గ్రామానికి మృతదేహాన్ని తీసుకువస్తారని బంధువులు తెలిపారు.

Updated Date - 2023-06-26T00:20:42+05:30 IST