రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-11-06T00:16:23+05:30 IST
మండలంలోని జామితోట సమీపంలో శని వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. దీనికి సంబంధించి స్థానిక ఎస్‌ఐ నీలకంఠరావు తెలిపిన వివ రాలు ఇలా ఉన్నాయి.
సీతంపేట: మండలంలోని జామితోట సమీపంలో శని వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. దీనికి సంబంధించి స్థానిక ఎస్‌ఐ నీలకంఠరావు తెలిపిన వివ రాలు ఇలా ఉన్నాయి. పులిపుట్టి గ్రామానికి చెందిన గొర్లె గడ్డె య్య (43) సీతంపేట నుంచి ద్విచక్రవాహనంపై పులిపుట్టిలో తన ఇంటికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పొద ల్లోకి దూసుకెళ్లడంతో గాయాలపాలై మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గడ్డెయ్య గ్రామంలో ఒక అనాథ శరణాలయం నిర్వహిస్తున్నాడు.