ధనదాహ ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2023-09-22T00:09:20+05:30 IST

సీఎం జగన్మోహన్‌రెడ్డి ధనదాహ ముఖ్యమంత్రి అని మాజీ మంత్రి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ మండిపడ్డారు.

ధనదాహ ముఖ్యమంత్రి

రాజాం: సీఎం జగన్మోహన్‌రెడ్డి ధనదాహ ముఖ్యమంత్రి అని మాజీ మంత్రి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసన గా నియోజకవర్గ తెలుగు యువత శేషపు రాజేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయ ఆవరణలో సామూహిక రిలే దీక్షలు చేపట్టారు. నిరుద్యోగులు, నాయకులు, కార్యకర్తలు, అభి మానులు, జనసేన నియోజకర్గ ఇన్‌చార్జి ఎన్ని రాజు దీక్షకు మద్దతు పలికారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు నంది సూర్యప్రకా శరావు, శాసపు రమేష్‌కుమార్‌, వంగా వెంకటరావు, కొల్ల అప్ప లనాయుడు, కిమిడి అశోక్‌కుమార్‌, శాసపు రాజేష్‌ కుమార్‌, టంకాల నాగరాజు, బి.నారాయణరావు, మడ్డు హరి, సూర్య నారాయణ, కొంపిల్ల రవి, కోటి, టంకాల కన్నంనాయుడు, మంగం రమేష్‌, పొన్నాడ భీమేశ్వరరావు పాల్గొన్నారు. నాలుగు మండలాల తెలుగు యువత అధ్యక్షులు పాల్గొన్నారు.

సీఐడీ అధికారులు విచారణ పేరుతో పెద్దాయనను వేధిస్తున్నారని మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. గురువారం శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతిలో నిండా మునిగిన సీఎం జగన్‌.. నిజాయితీ గల చంద్రబాబుకు అవినీతి ఆరోపణలు అంటగడుతూ పన్నిన కుట్రలో భాగమే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు అన్నారు.

Updated Date - 2023-09-22T00:09:20+05:30 IST