వాహనాలపైకి దూసుకెళ్లిన కారు
ABN , First Publish Date - 2023-03-02T23:58:52+05:30 IST
గొట్లాం గ్రామ సమీపంలో ఓ కారు విధ్వంసం సృష్టించింది.
బొండపల్లి: గొట్లాం గ్రామ సమీపంలో ఓ కారు విధ్వంసం సృష్టించింది. అత్యంత వేగంతో వచ్చి, ఆగిఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరా లు ఇలా ఉన్నాయి. గురువారం విజయనగరం వైపు నుంచి గజపతినగరం వైపు జాతీయరహదారిపై వేగంగా వస్తున్న ఓ కారు.. గొట్లాం గ్రామ సమీపంలోని టిఫిన్ సెంటర్ వద్ద ఆగిఉన్న ఆటో, బైకు, సైకిల్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సైకిల్ వద్ద నిలబడి ఉన్న కె.చంద్రరావు, ఆటోలో ఉన్న ఆటోడ్రైవర్ వి.వెంకటరమణ, అతని కూతురు వి.లికితశ్రీ తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ నిలబడి ఉన్న మరో ఇద్దరికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో విజయనగరం సర్వజన కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది.