పేరుకు పెద్ద చెరువు.. చూస్తే గుండె చెరువు

ABN , First Publish Date - 2023-06-26T23:59:28+05:30 IST

విజయనగరం పెద్ద చెరువు అంటే తెలియని వారుండరు. జిల్లాతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకుంటారు. రాజుల నాటి చెరువని.. సిరిమానోత్సవాల్లో అమ్మవారు ఊరేగుతారని.. ఒకప్పుడు వందలాది ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేసేదని అంటారు. అటువంటి గొప్ప చెరువును నేడు చూస్తే గుండె తరుక్కుపోతోంది.

పేరుకు పెద్ద చెరువు.. చూస్తే గుండె చెరువు

విజయనగరం పెద్ద చెరువు అంటే తెలియని వారుండరు. జిల్లాతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకుంటారు. రాజుల నాటి చెరువని.. సిరిమానోత్సవాల్లో అమ్మవారు ఊరేగుతారని.. ఒకప్పుడు వందలాది ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేసేదని అంటారు. అటువంటి గొప్ప చెరువును నేడు చూస్తే గుండె తరుక్కుపోతోంది. కలుషిత జలాలు, పాలథిన్‌ కవర్లతో స్వరూపమే మారిపోయింది. నగర ప్రజల వాడుక నీరు, మరుగుదొడ్ల నీరు కలుస్తుండడంతో చెరువు పక్కకు వెళ్లాలంటే ముక్కున వేలేసుకోవాల్సిన దుస్థితికి చేరింది. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన హరిజవహర్‌లాల్‌ చెరువు దుస్థితికి చలించి సంస్కరించేందుకు ప్రయత్నించారు. శ్రమదానంతో పాలథిన్‌ కవర్లు, చెత్తను తొలగించే క్రతువుకు శ్రీకారం చుట్టారు. ఆయన వెళ్లాక ఆ తంతు ఆగిపోయింది. గత ప్రభుత్వ హయాంలో రూ.20 కోట్లతో మురుగునీరు శుద్ధి చేసే ప్లాంట్‌ నిర్మాణాన్ని చేపట్టారు. చెరువులో చేరుతున్న నీటిని ముందే శుద్ధి చేయాలన్నది ఆ ప్లాంట్‌ లక్ష్యం. ప్రభుత్వం మారాక ఆ ప్రాజెక్టూ ఆగిపోయింది. పెద్ద చెరువుకు పూర్వ వైభవం వస్తుందా! అని నగర పౌరులు ఆవేదనతో ఎదురుచూస్తున్నారు.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

-----------

Updated Date - 2023-06-26T23:59:28+05:30 IST