‘జగనన్నకు చెబుదాం’లో 81 వినతులు

ABN , First Publish Date - 2023-09-23T00:26:28+05:30 IST

నెల్లిమర్ల మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో మొత్తం 81 వినతులు వచ్చాయి.

  ‘జగనన్నకు చెబుదాం’లో 81 వినతులు

నెల్లిమర్ల: నెల్లిమర్ల మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో మొత్తం 81 వినతులు వచ్చాయి. వీటిని కలెక్టర్‌ నాగలక్ష్మి, జేసీ మయూర్‌అశోక్‌ నేరుగా కార్యక్రమానికి హాజరై స్వీకరించారు. శాఖల వారీగా వాటిని విభజించి, సదరు శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 14, ఆర్డీవోకు 12, ఎంపీడీవో కు, డీఆర్‌డీఏ పీడీకి చెరో పది వంతున వినతులు అందాయి. గృహ నిర్మాణ శాఖకు 16, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏఈకి 5, పీఆర్‌ఏఈకి 5, జిల్లా కలెక్టర్‌కు, సారిపల్లి పంచాయతీ కార్యదర్శికి చెరో 2 వంతున, ఈవోపీఆర్డీ, మైన్స్‌ అండ్‌ జియాలజీ, పౌరసరఫరాలు, మెడికల్‌ ఆఫీసర్‌, పశు సంవర్థక శాఖ, సీడీపీవోలకు ఒక్కొక్కటి వంతున వినతులు అందినట్లు ఎంపీడీవో రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంబళ్ల సుధారాణి, అంబళ్ల శ్రీరాములునాయుడు, ఎంపీడీవో రామారావు, తహసీల్దార్‌ ధర్మరాజు, మండల ప్రత్యేక అధికారి, హౌసింగ్‌ పీడీ శ్రీనివాస్‌, ఈవోపీఆర్డీ భానోజీరావులతో పాటు వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్‌ను, జిల్లా కలెక్టర్‌లకు పుష్పగుచ్చాలు, దుశ్శాలువలు వేసి ఎంపీపీ సుధారాణి, శ్రీరాములునాయుడు దంపతులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు.

Updated Date - 2023-09-23T00:26:28+05:30 IST