ఎస్‌బీఐ ఖాతాదారుల సేవా కేంద్రంలో రూ.6లక్షలు పక్కదారి
ABN , First Publish Date - 2023-03-02T00:07:45+05:30 IST
బొబ్బిలి పట్టణంలోగల స్టేట్‌బ్యాంకు ఖాతాదారుల సేవా కేంద్రంలో పొదుపు సంఘాలకు చెందిన రూ.6లక్షలు పక్కదారి పట్టాయి.
బొబ్బిలి: బొబ్బిలి పట్టణంలోగల స్టేట్‌బ్యాంకు ఖాతాదారుల సేవా కేంద్రంలో పొదుపు సంఘాలకు చెందిన రూ.6లక్షలు పక్కదారి పట్టాయి. జాను మల్లువలస, గాదెలవలస తదితర గ్రామాలకు చెందిన పొదుపు సంఘాల సొమ్మును వారి ఖాతాలకు జమచేయకుండా కేంద్రం నిర్వాహకుడు తన సొంతా నికి వాడుకున్నట్లు తేలింది. దీనిపై వెంటనే బ్యాంకు అధికారులు అప్రమత్తమై విచారణ జరిపి, సొమ్మును అతని నుంచి రికవరీ చేయించారు. సేవా కేంద్రానికి తాళాలు వేయించారు. ఫ ఖాతాదారుల సేవా కేంద్రంలో జరిగే ఆర్థికపరమైన అవకతవకలతో బ్యాంకుకు ఎటువంటి సంబంధం లేదని బొబ్బిలి ఎస్‌బీఐ మెయి న్ బ్రాంచి చీఫ్ మేనేజరు లక్ష్మణరావు తెలిపారు. స్థానిక సేవా కేంద్రం నిర్వాహ కుడు రూ.6లక్షల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించి, వెంటనే అత డి నుంచి రికవరీ చేశామని, సేవా కేంద్రాన్ని ఈనెల 24 నుంచి మూసివేయించి లైసెన్సును రద్దు చేశామన్నారు. ప్రతి ఖాతాదారుడు ఎప్పటికప్పుడు తమ ఖాతా లను సరిచూసుకోవాలని సూచించారు.