స్పందనకు 303 వినతులు

ABN , First Publish Date - 2023-06-26T23:52:17+05:30 IST

కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వివిధ సమస్యలపై 303 వినతులు వచ్చాయి

స్పందనకు 303 వినతులు

కలెక్టరేట్‌: కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వివిధ సమస్యలపై 303 వినతులు వచ్చాయి. కలెక్టర్‌ నాగలక్ష్మి, జేసీ మయూర్‌ అశోక్‌, ఆర్‌డీవో ఎంవీ సూర్యకళ, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ పద్మలత, నూకరాజు, సులోచనరాణి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ తదితరులు ఈ వినతులు స్వీకరించారు. వీటిలో రెవెన్యూకు సం బంధించి 194, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 60, డీఆర్‌డీఏకు 11, గృహ నిర్మాణానికి 8, పంచాయతీరాజ్‌ 15, మున్సిపల్‌ శాఖకు 10, వైద్య ఆరోగ్య శాఖకు 3, విద్యుత్‌ పంపిణీ సంస్థకు 1 వినతి వచ్చాయి.

భోగాపురం మండలం ముంజేరు పంచాయతీ పరిధిలో గల సిద్దార్ధ కాలనీకి(ఎస్సీ) వెళ్లడానికి రహదారి సదుపాయం లేక చాలా ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసులు స్పందనలో మొర పెట్టుకున్నారు. ముంజేరు గ్రామం నుంచి వచ్చే మురికి నీరు తాము ప్రయాణం చేసే రహదారిపైకి విడిచి పెట్టడంతో పూర్తిగా బురదమయమైందని, దీంతో తమ కాలనీకి వెళ్లలేకపోతున్నామని వివరించారు. రహదారిపై ప్రయాణం చేయలేక నానా అవస్థలు పడుతున్నామని, నాలుగు సంవత్సరాలనుంచి వేధిస్తున్న ఈ సమస్యకు శాశ్వత పరష్కారం చూపాలని కాలనీవాసులు రమణీశ్వరి, కె.లక్ష్మి, జి.గురువులు, సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.

కలెక్టరేట్‌: నెల్లిమర్ల నియోజకవర్గంలో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందజేయడం లేదని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లోకం ప్రసాద్‌, మాధవి ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలో నియోజకవర్గ సమస్యలపై విన్నవించారు. అనంతరం స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయలేదని, కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్లు నిర్మాణాలకు అనుగుణంగా లేవని వివరించారు. నిర్మాణం చేసుకున్నవారికి బిల్లులు మంజూరు కావడం లేదన్నారు. గ్రామాల్లో పని చేస్తున్న వలంటీర్లు అర్హులకు పింఛన్లు మంజూరు చేయడం లేదని, నలుగురు దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాలు ఉన్నా పింఛన్లు మంజూరు చేయడం లేదన్నారు. కొన్ని గ్రామాలకు అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేయాల్సిన రోడ్లను నిర్మంచడం లేదన్నారు. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Updated Date - 2023-06-26T23:52:17+05:30 IST