2,800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:07 AM
కొమరాడ మండలంలోని లంజి గ్రామంలో సారా స్థావరాలపై ఎస్‌ఈబీ అఽధికారులు శనివారం దాడులు నిర్వహించారు
బెలగాం/కొమరాడ: కొమరాడ మండలంలోని లంజి గ్రామంలో సారా స్థావరాలపై ఎస్‌ఈబీ అఽధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఎస్‌ఈబీ సీఐ ఉపేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో 2800 లీటర్ల బెల్లపు ఊట, 20 లీటర్ల సారా ధ్వంసం చేశారు. ఈ మేరకు లంజి గ్రామానికి చెందిన నందేసు గణేష్‌పై కేసు నమోదు చేశారు. అలాగే కొమరాడ మండలం గుమ డ వద్ద ఒడిశా నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 200 లీటర్ల సారాను ఎస్‌ఈబీ అఽధికారులు స్వాధీనం చేసుకున్నారు. సారా అక్రమ రవాణా చేస్తు న్న గుమడ గ్రామానికి చెందిన బంగారి జనని, సిరిపురపు రవి, దేవులపల్లి శివు డు, నాటు సారా సరఫరా చేస్తున్న ఒడిస్సా రాష్ట్రానికి చెందిన బిడ్డిక చెల్లయ్య లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు సీఐ ఉపేంద్ర తెలిపారు.