స్పందనకు 244 వినతులు

ABN , First Publish Date - 2023-09-26T00:08:44+05:30 IST

కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన స్పంద నలో వివిధ సమస్యలపై 244 వినతులు వచ్చాయి. వీటిని కలెక్టర్‌ నాగలక్ష్మి, జేసీ మయూర్‌ అశోక్‌, ఆర్‌డీవో సూర్యకళ, డిప్యూటీ కలెక్టర్లు పద్మలత, సూర్యనారాయణ, సుదర్శనదొర స్వీకరించారు.

స్పందనకు 244 వినతులు

కలెక్టరేట్‌: కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన స్పంద నలో వివిధ సమస్యలపై 244 వినతులు వచ్చాయి. వీటిని కలెక్టర్‌ నాగలక్ష్మి, జేసీ మయూర్‌ అశోక్‌, ఆర్‌డీవో సూర్యకళ, డిప్యూటీ కలెక్టర్లు పద్మలత, సూర్యనారాయణ, సుదర్శనదొర స్వీకరించారు. వచ్చిన వినతుల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి 150, డీఆర్‌డీఏ 20, వైద్య ఆరోగ్య శాఖకు 7, గ్రామ వార్డు సచివాలయానికి 20, జిల్లా పంచాయతీ అధికారికి 13, మున్సిపల్‌ శాఖకు 14, హౌసింగ్‌ 15, విద్యుత్‌ శాఖకు 5 వినతులు వచ్చాయి.

ఫ గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన రొంగళి జయ ప్రకాష్‌ మానసిక వికలాంగుడు. 100 శాతం దివ్యాంగుడు కావడంతో గతంలో ప్రభుత్వం పించన్‌ మంజూరు చేసింది. అయితే కొన్ని నెలలు తరువాత జయ ప్రకాష్‌ పింఛన్‌ తొలిగించారు. దీంతో ప్రకాష్‌ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. పింఛన్‌ పునరుద్ధరించాలని కోర్టు కూడా ఆదే శాలు ఇచ్చింది. ఈ సమస్యను మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పంద నలో జయ ప్రకాష్‌ తండ్రి సింహాద్రప్పడు విన్నవించుకున్నారు. పింఛన్‌ ఇప్పించాలని కోరారు.

పింఛన్‌ తీసేశారు..

ఎస్‌.యల్లయ్యమ్మ భో గాపురం మండలం గుడివాడ గ్రామానికి చెందిన దివ్యాంగురాలు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె ప్రభుత్వం ఇచ్చిన పింఛన్‌ డబ్బులుతో జీవ నం సాగిస్తున్నారు. చివరికి సొంత ఇళ్ళు కూడా లేదు. అయితే గత కొద్ది నెలలు క్రితం ఆమెకు వి ద్యుత్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయనే కారణంతో పింఛన్‌ నిలిపివేశారు. దీంతో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్ర మానికి వచ్చి తన సమస్యను విన్నవించుకుంది. వెంటనే పింఛన్‌ పునరుద్ధ రించాలని కోరింది.

Updated Date - 2023-09-26T00:08:44+05:30 IST