‘కాపు నేస్తం’తో 1520మందికి లబ్ధి

ABN , First Publish Date - 2023-09-17T00:25:37+05:30 IST

వైఎస్సార్‌ కాపు నేస్తం కింద జిల్లాలో 1,520 మంది లబ్ధిదారులకు రూ.2.28 కోట్ల ఆర్థిక సాయం అందింది.

‘కాపు నేస్తం’తో 1520మందికి లబ్ధి

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: వైఎస్సార్‌ కాపు నేస్తం కింద జిల్లాలో 1,520 మంది లబ్ధిదారులకు రూ.2.28 కోట్ల ఆర్థిక సాయం అందింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శనివారం ఈ కార్యక్రమం ప్రారంభించారు. వర్చువల్‌ విధానంలో కలెక్టర్‌ కార్యాలయం నుంచి జేసీ ఆర్‌.గోవిందరావు మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కింద 1,520 మందికి సాయం అందుతుందన్నారు. అనంతరం నమూనా చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రంగుముద్రి రమాదేవి, కళింగ వైశ్య కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మెహర్‌ ప్రసాద్‌, గండ్ల తెలుకల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వెంకటరమణ, శెట్టి బలిజ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సంపతి తిరుపతి, జిల్లా బీసీ సంక్షేమ సాధికార అధికారి కృష్ణ, బీసీ కార్పొరేషన్‌ ఏఈవో గోపి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-17T00:25:37+05:30 IST