నాకు, బొడ్డేడకు... జగన్ క్లాస్!
ABN , First Publish Date - 2023-02-07T01:08:24+05:30 IST
నియోజకవర్గంలో వర్గపోరు వల్ల మా ఇద్దరికీ (బొడ్డేడ ప్రసాద్) నష్టమని, మరోవైపు పార్టీ అధినేత జగన్ సైతం క్లాస్ తీసుకున్నారని ఎమ్మెల్యే కన్నబాబురాజు అన్నారు.

మునగపాక, ఫిబ్రవరి 6 : నియోజకవర్గంలో వర్గపోరు వల్ల మా ఇద్దరికీ (బొడ్డేడ ప్రసాద్) నష్టమని, మరోవైపు పార్టీ అధినేత జగన్ సైతం క్లాస్ తీసుకున్నారని ఎమ్మెల్యే కన్నబాబురాజు అన్నారు. గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్‌తో కలిసి మునగపాకలో సోమవారం పార్టీ శ్రేణులతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. ఈ వర్గపోరు వల్ల ఇద్దరికీ విపరీతంగా డబ్బు ఖర్చయ్యిందని, మెంటల్‌గా టార్చర్ అనుభవించామన్నారు. మేం ఇరువురం కలవడం కొంతమందికి కష్టంగానూ, చాలామందికి ఇష్టంగానూ ఉందని వివరించారు. ఒకవైపు ప్రతిపక్షాలన్నీ కలిసి ఐక్యంగా పనిచేస్తుంటే తామెందుకు విభేదించుకోవాలని పేర్కొన్నారు. ఇకపై నియోజకవర్గంలో వర్గపోరు ఉండదన్నారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.