టీడీపీ బస్సు యాత్రకు ఘనస్వాగతం
ABN , First Publish Date - 2023-06-26T00:13:44+05:30 IST
భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ చేపట్టి ఉత్తరాంధ్ర బస్సు యాత్ర ఆదివారం ఉదయం 11 గంటలకు నర్సీపట్నం నుంచి రోలుగుంట మండలం వెలంకాయలపాలెం వద్ద చోడవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
జగన్ పాలనకు చరమగీతం పాడాలని నేతలు పిలుపు
వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరిక
రోలుగుంట, జూన్ 25 : భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ చేపట్టి ఉత్తరాంధ్ర బస్సు యాత్ర ఆదివారం ఉదయం 11 గంటలకు నర్సీపట్నం నుంచి రోలుగుంట మండలం వెలంకాయలపాలెం వద్ద చోడవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పడాలపాలెం పంచాయతీ ఎల్.కొత్తూరుకు చెందిన 8వ వార్డు మెంబరు లగుడు సత్తిబాబుతో పాటు లగుడు సూరిబాబు, లగుడు శ్రీనివాసరావు, గూటాల నాగేశ్వరరావు, పలువురు వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే రాజు, టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా బయలుదేరి రోలుగుంటకు చేరుకుంది. ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అనంతరం భోగాపురం మీదుగా రావికమతం మండలం కొత్తకోట చేరుకుంది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గములూరు చంద్రమౌళి, పంచాడ చంద్ర, సుర్ల రామకృష్ణ, బంటు చిరంజీవి, పిట్ల బుల్లిబాబు, ఉండా రమణబాబు, బంటు రాజు, కోలిపల్లి ఈశ్వరరావు, కర్రి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
రావికమతంలో బ్రహ్మరథం
రావికమతం, జూన్ 25: ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో టీడీపీ చేపట్టిన బస్సు యాత్రకు మండలంలో ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కొత్తకోట వద్దక చేరుకుని రోలుగుంట మండలం నుంచి వస్తున్న బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు. కొత్తకోట నుంచి రావికమతం వరకు దారి పొడుగునా ప్రజలు పూల వర్షం కురిపించి బ్రహ్మరథం పట్టారు. కొత్తకోటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరావు, నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు తదితరులు ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలు అర్పించారు. దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్సు యాత్రలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, తెలుగు రైతు ఉపాఽధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు, టీడీపీ మండల నాయకులు కోట నీలవేణి, రాజాన కొండనాయుడు, కోట గోవిందరావు, గంజి సూర్యనారాయణ, మోదునాయుడు, తదితరులు పాల్గొన్నారు.