బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును అడ్డుకుంటాం
ABN , First Publish Date - 2023-09-26T00:48:03+05:30 IST
మండలంలో ప్రమాదకరమైన బల్క్ డగ్ర్ పార్క్‌ను ఏర్పాటు చేస్తే తాము అడ్డుకుంటామని అమలాపురం గ్రామస్థులు స్పష్టం చేశారు.

నక్కపల్లి, సెప్టెంబరు 25: మండలంలో ప్రమాదకరమైన బల్క్ డగ్ర్ పార్క్‌ను ఏర్పాటు చేస్తే తాము అడ్డుకుంటామని అమలాపురం గ్రామస్థులు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం గ్రామంలోని తుఫాన్ భవనం వద్ద గ్రామస్థులు నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, మత్స్యకారులు, రైతులకు హాని చేసే రసాయన పరిశ్రమలను ఏర్పాటు చే స్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే హెటెరో ఔషధ పరిశ్రమ వల్ల కలిగిన నష్టం, కాలుష్యం నుంచి తేరుకోలేకపోతున్నామని చెప్పారు.