రోజుకి పది లక్షల లీటర్ల పాల సేకరణే లక్ష్యం

ABN , First Publish Date - 2023-02-07T01:02:29+05:30 IST

పాల సేకరణను రోజుకు పది లక్షల లీటర్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌ కుమార్‌ తెలిపారు.

రోజుకి పది లక్షల లీటర్ల పాల సేకరణే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న ఆనంద్‌కుమార్‌

మాడుగుల, ఫిబ్రవరి 6 : పాల సేకరణను రోజుకు పది లక్షల లీటర్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం స్థానిక కల్యాణ మండలంలో మాడుగుల, చీడికాడ మండలాలకు చెందిన పాల సంఘాల అధ్య క్ష, కార్యదర్శులు నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. పాడి రైతులు రోజుకి పది లీటర్లు పాలు పోస్తే గిట్టుబాటు ధర వస్తుందన్నారు. రైతులకు మేలి రకం ఆవులు అం దించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పశువులకు దాణా పూర్తి స్థాయిలో అందిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. తన తండ్రి తులసీరావు కోరిక మేరకు డెయిరీ ఆస్పత్రిలో కేన్సర్‌ బ్లాక్‌ని ఏర్పాటు చేసినట్టు చెప్పా రు. అలాగే ప్రతీ పాల సేకరణ కేంద్రం వద్ద తులసీరావు విగ్ర హాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అనంతరం డెయిరీ డైరెక్టర్‌ శీరంరెడ్డి సూర్యనారాయణ ఆధ్వర్యంలో రెండు మండ లాల పాల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు. సమా వేశం ప్రారంభంలో విశాఖ డెయి రీ చైర్మన్‌ దివంగత ఆడారి తులసీరావు మృతికి కొద్ది సేపు మౌనం పాటించారు.

మోదకొందమ్మను దర్శించుకున్న ఆనంద్‌కుమార్‌

స్థానిక మోదకొండమ్మని దర్శించుకొనేందుకు వచ్చిన విశాఖ డెయిరీ చైర్మ న్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ను ఆలయ కమి టీ చైర్మన్‌ పుప్పాల అప్పలరాజు సాదరంగా ఆహ్వానించారు. అమ్మ వారి గర్భగుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించా రు.అనంతరం స్థానిక ఎంపీపీ రామధర్మజ, సర్పంచ్‌ కళావతి, పొలిమేర చిన్నంనాయుడు, బొమ్మిశెట్టి శ్రీను తదితరులు సన్మానించారు. ఈ కార్యక్రమం లో సేనాపతి కొండలరావు, సం జీవ్‌, కర్రి సత్యం, గేదెల సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:02:29+05:30 IST