మన్యంలో వైద్యారోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ పర్యటన
ABN , First Publish Date - 2023-06-14T00:34:52+05:30 IST
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ యశ్మిన్ మంగళవారం మన్యంలో పర్యటించారు. గిరిజన ప్రాంతంలో రోగులకు అందుతున్న వైద్యారోగ్య సేవలపై ఆమె ఆరా తీశారు. తొలుతగా ఆమె హుకుంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, అక్కడ రోగులతో మాట్లాడారు.
మన్యంలో వైద్యారోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ పర్యటన
- పాడేరు జిల్లా ఆస్పత్రి, హుకుంపేట పీహెచ్‌సీ, తుంపాడ సబ్ సెంటర్ సందర్శన
- గిరిజన రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆమె ఆరా
పాడేరు, జూన్ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ యశ్మిన్ మంగళవారం మన్యంలో పర్యటించారు. గిరిజన ప్రాంతంలో రోగులకు అందుతున్న వైద్యారోగ్య సేవలపై ఆమె ఆరా తీశారు. తొలుతగా ఆమె హుకుంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, అక్కడ రోగులతో మాట్లాడారు. అలాగే పీహెచ్‌సీలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. పలువురు బాలింతలతో మాట్లాడారు. ఆశ కార్యాకర్తలతో సమావేశమై పలు అంశాలను ఆమె వివరించారు. అనంతరం స్థానిక జిల్లా ఆస్పత్రి పరిధిలో ఉన్న పోషకాహార పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందుతున్న సేవలను ఆమె వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మండలంలో తుంపాడ ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న ఫ్యామిలీ డాక్టర్ సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ సి.జమాల్ బాషా, జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ టి.విశ్వేశ్వరనాయుడు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.