సినీ పరిశ్రమకు విశాఖ అనుకూలం

ABN , First Publish Date - 2023-02-07T00:08:10+05:30 IST

సినీ పరిశ్రమకు విశాఖ ఎంతో అనుకూలమని ప్రముఖ దర్శకుడు వీఎన్‌ ఆదిత్య అన్నారు. సోమవారం ఆయన ఏయూలోని హిందీ భవన్‌ సెమినార్‌ హాల్‌లో వైజాగ్‌ ఫిల్మ్‌ సొసైటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సినీ పరిశ్రమకు విశాఖ అనుకూలం

సిరిపురం, ఫిబ్రవరి 6 : సినీ పరిశ్రమకు విశాఖ ఎంతో అనుకూలమని ప్రముఖ దర్శకుడు వీఎన్‌ ఆదిత్య అన్నారు. సోమవారం ఆయన ఏయూలోని హిందీ భవన్‌ సెమినార్‌ హాల్‌లో వైజాగ్‌ ఫిల్మ్‌ సొసైటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంచి చిత్రాలు ప్రజలకు చేరువయ్యేందుకు వైజాగ్‌ ఫిల్మ్‌ సొసైటీ చేస్తున్న కృషిని అభి నందించారు. విశాఖలో ప్రభుత్వం శాశ్వత సదుపాయాలు ఏర్పాటు చేస్తే 24 క్రాఫ్ట్‌కు చెందిన యూనియన్లు పనిచేస్తాయని, తద్వారా వేగంగా ఇక్కడ సినిమాల షూటింగ్‌లు జరుగుతాయని చెప్పారు. ఇక్కడ హీరోలు ఇళ్లు కట్టుకుంటే అభివృద్ధి జరగదని, అది కేవలం కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపారు. ఆయనతో పాటు వీఎఫ్‌ఎస్‌ గౌరవ అధ్యక్షుడు ఆచార్య ఎన్‌ఏడీ పాల్‌, గౌరవ కార్యదర్శి నరవ ప్రకాశరావు, ప్రొఫెసర్‌ ఎన్‌. సత్యనారాయణ, వీఎఫ్‌ఎస్‌ ఉపాధ్యక్షుడు కాశీవిశ్వేశ్వరరావు, సహాయ కార్యదర్శి బి. చిన్నారావు, కార్యవర్గ సభ్యులు ఆర్‌. శివకుమార్‌, సంతోష్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2023-02-07T00:08:16+05:30 IST