ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన
ABN , First Publish Date - 2023-03-06T00:58:39+05:30 IST
గొలుగొండ మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను అధికారులు అమలు చేయడంలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి సీఎం, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఫొటోలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు వుండకూడదు. అధికార పార్టీతోపాటు ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేయాలి. కానీ మండలంలో రేషన్ పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహనాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఫొటోలను తొలగించలేదు.
రేషన్ పంపిణీ వాహనాలపై సీఎం జగన్ ఫొటో
అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపణ
కృష్ణాదేవిపేట, మార్చి 5: గొలుగొండ మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను అధికారులు అమలు చేయడంలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి సీఎం, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఫొటోలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు వుండకూడదు. అధికార పార్టీతోపాటు ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేయాలి. కానీ మండలంలో రేషన్ పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహనాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఫొటోలను తొలగించలేదు. ఏఎల్‌పురం, కొంగసింగి, చోద్యం, పాతకృష్ణాదేవిపేట తదితర గ్రామాల్లో రేషన్ పంపిణీకి వచ్చిన ఎండీయూ వాహనాలపై సీఎం జగన్‌ఫొటోలు యథావిధిగా కనిపిస్తున్నాయి. కనీసం ఫొటో కనిపించకుండా కాగితాలు కూడా అతికించలేదు. ఎన్నికల అధికారులు పక్షపాతవైఖరిని అవలంబిస్తున్నారని, ఎన్నికల కోడ్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడంలేదని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు.