మార్కెట్లకు వినాయక చవితి శోభ
ABN , First Publish Date - 2023-09-18T01:25:20+05:30 IST
వినాయక చవితి సందర్భంగా ఆదివారం మార్కెట్లు సందడిగా మారాయి. స్వామి పూజకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు భారీగా తరలి రావడంతో కిక్కిరిసిపోయాయి.

ఎటు చూసినా కోలాహల వాతావరణం
నర్సీపట్నం, సెప్టెంబరు 17 : వినాయక చవితి సందర్భంగా ఆదివారం మార్కెట్లు సందడిగా మారాయి. స్వామి పూజకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు భారీగా తరలి రావడంతో కిక్కిరిసిపోయాయి. నర్సీపట్నంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే వాతావరణం కొనసాగింది. పాల్‌ఘాట్ సెంటర్ నుంచి అబీద్ సెంటర్ వరకు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా గణపతి విగ్రహాలు, పత్రి, పాలవల్లీలు, పండ్లు, పూల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆయా దుకాణాల వద్ద జనం రద్దీ పెరగడంతో ట్రాఫిక్ స్తంభించింది. రూ.20 మట్టి విగ్రహాల నుంచి రూ.10వేలు భారీ విగ్రహాల వరకు మార్కెట్లో విక్రయించారు. అన్నిరకాల పండ్లుకలిపి రూ.100కు కిట్ రూపంలో అమ్మకాలు జరిపారు. రిబ్బన్లు, ప్లాస్టిక్ దండలు, పూలు వంటి డెకరేషన్ సామగ్రిని పిల్లలు, యువత కొనుగోలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో కూడా పండగ రద్దీ కనిపించింది. పట్టణ సీఐ గణేశ్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టారు.
దేవరాపల్లి : మండల కేంద్రం దేవరాపల్లి ఆదివారం కోలాహలంగా మారింది. వినాయక చవితి సందర్భంగా పూజా సామగ్రి కొనుగోలుకు గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రావడంతో రోడ్లు సందడిగా మారాయి. దీనికి తోడు వారపు సంత కావడంతో రద్దీ మరింతగా పెరగడంలో పోలీసులు ట్రాఫిక్‌కు క్రమబద్ధీకరించారు. పూజకు అవసరమైన సామగ్రిని అంతా కొనుగోలు చేసుకున్నారు.