Share News

ముక్కోటి ఏకాదశికి ఉపమాక క్షేత్రం సిద్ధం

ABN , Publish Date - Dec 23 , 2023 | 01:04 AM

ముక్కోటి ఏకాదశికి ఉపమాక క్షేత్రం సిద్ధమైంది. గరుడాద్రిపైన, కొండ దిగువున ఉన్న ఆలయాల్లో శుక్రవారం సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రధాన రాజగోపురం బయట తాత్కాలిక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.

ముక్కోటి ఏకాదశికి ఉపమాక క్షేత్రం సిద్ధం
కొండదిగువ ఆలయంలో ఆస్థాన మండపం చుట్టూ ఏర్పాటు చేసిన పెండాల్స్‌

నక్కపల్లి, డిసెంబరు 22: ముక్కోటి ఏకాదశికి ఉపమాక క్షేత్రం సిద్ధమైంది. గరుడాద్రిపైన, కొండ దిగువున ఉన్న ఆలయాల్లో శుక్రవారం సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రధాన రాజగోపురం బయట తాత్కాలిక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణ, ఆస్థాన మండపం చుట్టూ పెండాల్స్‌ వేశారు. కొండపై వున్న స్వామి వారి నిజరూపానికి తెల్లవారుజామున మూడు గంటల నుంచి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు చెప్పారు. ముక్కోటి ఏకాదశి రోజున కొండ దిగువున్న వున్న ఆలయంలో ఉత్సవమూర్తి రంగనాథుడిగా భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వామి వారిని భక్తులు దర్శించుకోవచ్చు. సాయంత్రం పుణ్యకోటి వాహనంపై రంగనాథుడికి తిరువీధి సేవ నిర్వహిస్తారు.

Updated Date - Dec 23 , 2023 | 01:04 AM