భెల్‌ త్రిఫ్ట్‌ సొసైటీ ఎన్నికల్లో యునైటెడ్‌ ఫ్రంట్‌ విజయం

ABN , First Publish Date - 2023-02-24T00:22:24+05:30 IST

భెల్‌ హెచ్‌పీవీపీ ఎంప్లాయీస్‌ త్రిఫ్ట్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ పాలక వర్గానికి గురువారం జరిగిన ఎన్నికల్లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏడు డైరెక్టర్‌ స్థానాలను కైవసం చేసుకోగా, పరిరక్షణ ఫ్రంట్‌ ఒక్క డైరెక్టర్‌ స్థానాన్ని సాధించింది.

భెల్‌ త్రిఫ్ట్‌ సొసైటీ ఎన్నికల్లో యునైటెడ్‌ ఫ్రంట్‌ విజయం
విజయ సంకేతం చూపుతున్న డైరెక్టర్లుగా గెలుపొందిన అభ్యర్థులు

అక్కిరెడ్డిపాలెం, ఫిబ్రవరి 23: భెల్‌ హెచ్‌పీవీపీ ఎంప్లాయీస్‌ త్రిఫ్ట్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ పాలక వర్గానికి గురువారం జరిగిన ఎన్నికల్లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏడు డైరెక్టర్‌ స్థానాలను కైవసం చేసుకోగా, పరిరక్షణ ఫ్రంట్‌ ఒక్క డైరెక్టర్‌ స్థానాన్ని సాధించింది. ఐదేళ్లకొకసారి జరిగే ఈ ఎన్నికల్లో ఎనిమిది డైరెక్టర్‌ స్థానాలను ఎన్నుకోవాల్సి వుండగా.. గురువారం జరిగిన ఎన్నికల్లో యునైటెడ్‌ ఫ్రంట్‌, ప్రోగ్రసివ్‌ ఫ్రంట్‌, పరిరక్షణ ఫ్రంట్‌లు ఎనిమిది మంది చొప్పున తమ అభ్యర్థులను పోటీలో నిలిపాయి. కాగా సీక్రెట్‌ బ్యాల్‌ట్‌ విధానంలో జరిగిన ఎన్నికల్లో 446 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో యునైటెడ్‌ ఫ్రంట్‌ అభ్యర్థులు మందా వెంకటరాజు, కర్రి నాగ వరప్రసాద్‌, కొరుప్రోలు రామునాయుడు, గెద్దాడ ప్రసాద్‌, కె.ధర్మారావు, ఎన్‌బీ ప్రశాంత్‌కుమార్‌, వారణాశి గోవిందరావు విజయం సాధించగా, యునైటెడ్‌ ఫ్రంట్‌ నుంచి జీటీపీ ప్రకాశ్‌ గెలుపొందినట్టు ఎన్నికల అధికారి సీహెచ్‌ఎస్‌ త్రినాథరావు తెలిపారు. విజయం సాధించినఈ ఎనిమిది మంది డైరెక్టర్లు త్వరలో సమావేశమై అధ్యక్ష, కార్యదర్శి ఎన్నుకుంటారని త్రిఫ్ట్‌ సొసైటీ మేనేజర్‌ గవర వెంకటరమణ పేర్కొన్నారు. కాగా విజయం సాధించిన యునైటెడ్‌ ఫ్రంట్‌ అభ్యర్థులను యూనియన్‌ నాయకులు ఎస్‌.సాహు, అలమండ వెంకటేశ్వరరావు, ఎ.వెంకటరావు, పీవీఎన్‌ రాజు, కె.కొండలరావు, తదితరులు అభినందించారు.

Updated Date - 2023-02-24T00:22:28+05:30 IST