యూసీసీ టీ20 క్రికెట్ చాంప్ కవలియర్స్
ABN , First Publish Date - 2023-03-26T23:43:22+05:30 IST
జిల్లా క్రికెట్ సంఘం గుర్తింపు పొందిన యూసీసీ టీ20 క్రికెట్ టోర్నీలో కవలియర్స్ సీసీ చాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
రన్నరప్‌గా తూర్పుకోస్తా రైల్వే
విశాఖపట్నం(స్పోర్ట్సు), మార్చి 26: జిల్లా క్రికెట్ సంఘం గుర్తింపు పొందిన యూసీసీ టీ20 క్రికెట్ టోర్నీలో కవలియర్స్ సీసీ చాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. తూర్పుకోస్తా రైల్వే రన్నరప్ స్థానంలో నిలిచింది. ఆదివారం రైల్వే గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్స్‌లో కవలియర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రైల్వేస్‌లో శ్యాంసుందర్ హాఫ్ సెంచరీ(74), ఎంఎస్ దీపక్ (21) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 161 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కవలియర్స్ సీసీలో హర్షవర్దన్(65), చంద్రమౌళి(56) హాఫ్ సెంచరీలు చేయగా పాండురంగరాజు(32) రాణించి తోడ్పాటివ్వడంతో 18 ఓవర్లలో కేవలం రెండు వికెట్టు నష్టపోయి విజయం సొంతం చేసుకుంది. కాగా టోర్నీ ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా హర్షవర్ధన్(కవలియర్స్), బౌలర్‌గా డేవిడ్ రాజ్(రైల్వేస్), ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా పాండురంగరాజు నిలిచారు. టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఏసీఏ మాజీ ఉపాధ్యక్షుడు జీజేజే రాజు, వీడీసీఏ కార్యదర్శి పార్థసారఽథి, సంయుక్త కార్యదర్శి జేకేఎం రాజు, క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఆర్‌వీసీహెచ్.ప్రసాద్), నిర్వాహకులు రమణమూర్తి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.