వీవీ రమణకు ఘన నివాళి
ABN , First Publish Date - 2023-06-26T00:09:32+05:30 IST
రాజ్యసభ సభ్యుడు స్వర్గీయ వీవీ రమణ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలో గల ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తుమ్మపాల, జూన్ 25 : రాజ్యసభ సభ్యుడు స్వర్గీయ వీవీ రమణ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలో గల ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు పార్టీ నాయకులు, రైతులతో కలిసి వీవీ రమణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పాలిట వీవీ రమణ దేవుడని కొనియాడారు. రమణ పలు పోరాటాలు చేసి రైతులకు మేలు చేకూర్చారన్నారు. తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీని స్థాపించిన వీవీ రమణ ఆశయం నెరవేర్చాలంటే కచ్చితంగా ఫ్యాక్టరీని తెరిపించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సుగర్ ఫ్యాక్టర్‌పై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బూటకపు హామీలిచ్చి ఈ ప్రాంత రైతాంగాన్ని మోసగించిందన్నారు. అలాగే వీవీ రమణ విగ్రహానికి రైటర్స్ అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్రి బాబి, కొణతాల శ్రీనివాసరావు, నడిపల్లి బోసుబాబు, చదరం కాశీ, కంకణాల ఆదిమూర్తి, గొర్లి మోదినాయుడు, నడిపల్లి గణేష్, షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు ఏవీ నూకేశ్వరరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.