కణితి రోడ్డులో ప్రయాణమంటే నరకమే..

ABN , First Publish Date - 2023-05-26T00:37:06+05:30 IST

ప్రధాన రహదారులను ఇష్టం వచ్చినట్టు తవ్వి విడిచిపెట్టడంతో అస్తవ్యస్తంగా తయార య్యాయి. ప్రస్తుతం జోనల్‌ పరిధిలో యూజీడీ పనులు, మరో పక్క నీటి పైప్‌లైన్‌ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.

కణితి రోడ్డులో ప్రయాణమంటే నరకమే..
కణితి రోడ్డులో గురువారం యూజీడీ గోతుల్లో కూరుకుపోయి బోల్తా పడిన లారీ

యూజీడీ గోతులతో ఇబ్బందులు

గోతుల్లో కూరుకుపోయి లారీ బోల్తా

గాజువాక, మే 25: ప్రధాన రహదారులను ఇష్టం వచ్చినట్టు తవ్వి విడిచిపెట్టడంతో అస్తవ్యస్తంగా తయార య్యాయి. ప్రస్తుతం జోనల్‌ పరిధిలో యూజీడీ పనులు, మరో పక్క నీటి పైప్‌లైన్‌ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ప్రధాన రహదారులను సైతం పూర్తిగా తవ్వి విడిచిపెట్టారు. దీంతో వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. జీవీఎంసీ 72వ వార్డులో కణితి రోడ్డులో గత పది రోజులుగా యూజీడీ పనుల నిమిత్తం సగం రోడ్డును తవ్వేశారు. తాజాగా రెండు రోజుల నుంచి మిగతా రోడ్డు కూడా తవ్వడంతో బురదమయంగా మారింది. ఈ క్రమంలో గురువారం కురిసిన వర్షానికి మరింత దారుణంగా ఉంది. సాయంత్రం ఈ రోడ్డులో రెండు లారీలు కూరుకుపోయాయి. ఇందులో ఓ లారీ బోల్తా పడింది. అదే విధంగా పలు ద్విచక్ర వాహనదారులు కూడా గోతుల్లో పడిపోయి గాయాలపాలయ్యారు. ప్రధాన రహదారుల్లో గోతులు తవ్వి విడిచిపెట్టడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీవీఎంసీ అధికారులు ఇటువంటి ప్రధాన సమస్యలపై దృష్టి సారించడం లేదని 72వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు ఆరోపించారు.

Updated Date - 2023-05-26T00:37:06+05:30 IST