Share News

పలువురు డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

ABN , First Publish Date - 2023-10-23T00:39:33+05:30 IST

ఉమ్మడి విశాఖ జిల్లాలో పలువరు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.

పలువురు డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి విశాఖ జిల్లాలో పలువరు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. నగరంలోని జాతీయ రహదారుల విభాగం డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్‌.వెంకటేశ్వర్లును అనకాపల్లి జిల్లాలో కేఆర్‌ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీచేసి, అతని స్థానంలో విజయనగరం జిల్లా తోటపల్లి బ్యారేజ్‌ ప్రాజెక్టు-2 డిప్యూటీ కలెక్టర్‌ కె.పద్మలతను నియమించారు. పలాస ఆర్డ్డీవో టి.శ్రీరామమూర్తిని విశాఖ జిల్లా భూసేకరణ విభాగానికి బదిలీచేసి, ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌.జ్యోతిమాధవిని కాకినాడ జిల్లా మైనారిటీ అధికారిగా, కేఆర్‌ఆర్‌సీ డిప్యూటీ కలెక్టరు సత్యపద్మను కాకినాడ జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా నియమించి ఆమె స్థానంలో బొబ్బిలి ఆర్డీవో పి.శేషశైలజను నియమించారు. ఓఎన్‌జీసీ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న టీఎఫ్‌ఎం రాజును విశాఖలో ఏపీఐఐసీ డిప్యూటీ కలెక్టర్‌గా, కాకినాడ సెజ్‌లో ఎస్డీసీగా ఉన్న కె.మనోరమను ఎలమంచిలి ఎన్‌ఏవోబీ డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు.

Updated Date - 2023-10-23T00:39:33+05:30 IST