నేడు తులసీరావు సంతాప సభ

ABN , First Publish Date - 2023-01-18T00:31:03+05:30 IST

విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు సంతాప సభ బుధవారం ఎలమంచిలిలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు.

నేడు తులసీరావు సంతాప సభ
విశాఖ డెయిరీ అధికారులు, సిబ్బందితో మాట్లాడుతున్న వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌, డైరెక్టర్‌ రమాకుమారి

హాజరుకానున్న పలువురు ప్రముఖులు

ఎలమంచిలి, జనవరి 17 : విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు సంతాప సభ బుధవారం ఎలమంచిలిలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు. సంతాప సభకు ఉత్తరాంధ్ర నుంచి రాజకీయ, రాజకీయేతర ప్రముఖులు, తులసీరావు అభిమానులు, డెయిరీ అధికారులు, సిబ్బంది, రైతులుహాజరుకానున్నారు. సుమారు 30 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. వీరిందరికీ మధ్యాహ్నం భోజనం వడ్డించడానికి తులసీనగర్‌లోని ఆయన ఇంటికి చెంతనే సుమారు ఐదు ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా విశాఖ డెయిరీ వైస్‌ చైర్మన్‌, తులసీరావు కుమారుడైన ఆడారి ఆనంద్‌, డెయిరీ డైరెక్టర్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రమాకుమారి మంగళవారం డెయిరీ డైరెక్టర్లు, అధికారులు, సిబ్బందితో ఇక్కడ సమావేశం నిర్వహించారు. సంతాప సభ, భోజనాల ఏర్పాట్లపై చర్చించారు. పట్టణంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టింది.

Updated Date - 2023-01-18T00:31:04+05:30 IST