నేడే భెల్‌ త్రిఫ్ట్‌ సొసైటీ ఎన్నికలు

ABN , First Publish Date - 2023-02-23T00:31:29+05:30 IST

భెల్‌ హెచ్‌పీవీపీ ఎంప్లాయీస్‌ కో-ఆపరేటివ్‌ త్రిఫ్ట్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ పాలకవర్గానికి గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఐదేళ్ల కొకసారి జరిగే ఈ ఎన్నికల్లో ఎనిమిది మంది డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు.

 నేడే భెల్‌ త్రిఫ్ట్‌ సొసైటీ ఎన్నికలు

అక్కిరెడ్డిపాలెం, ఫిబ్రవరి 22: భెల్‌ హెచ్‌పీవీపీ ఎంప్లాయీస్‌ కో-ఆపరేటివ్‌ త్రిఫ్ట్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ పాలకవర్గానికి గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఐదేళ్ల కొకసారి జరిగే ఈ ఎన్నికల్లో ఎనిమిది మంది డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. గురువారం జరగనున్న ఎన్నికల్లో ప్రధాన కార్మిక సంఘాలైన ప్రోగ్రసివ్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌, పరిరక్షణ ఫ్రంట్‌ల నాయకులు ఎవరికివారు ఎనిమిది మంది చొప్పున అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టారు. త్వరలోనే గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు వుండడంతో అన్ని కార్మిక సంఘాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని చేశాయి. గురువారం జరిగే ఎన్నికల్లో 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, పోలింగ్‌ అనంతరం సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు.

Updated Date - 2023-02-23T00:31:32+05:30 IST