టిడ్కో గృహాల లబ్ధిదారులకు అప్పగించాలి

ABN , First Publish Date - 2023-08-02T00:44:47+05:30 IST

సత్యనారాయణపురంలో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు.

టిడ్కో గృహాల లబ్ధిదారులకు అప్పగించాలి
టిడ్కో గృహాలను పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు

కొత్తూరు, ఆగస్టు 1 : సత్యనారాయణపురంలో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్‌. శంకరరావు, గంటా శ్రీరామ్‌, సీపీఎం నాయకులు ఎ.బాలకృష్ణ, నూకఅప్పారావు తదితరులు మంగళవారం సాయంత్రం టిడ్కో గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ టిడ్కో గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించి, వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను కేటాయించకపోవడంతో డీడీలు వెనక్కి తీసుకుంటున్నారన్నారు. 3096 ప్లాట్లను నిర్మించినా వాటిని అప్పగించకుండా జాప్యం చేయడం సరికాదన్నారు. టిడ్కో గృహాలకు ఆనుకొని 2016లో హుద్‌హుద్‌ తుఫాన్‌ బాధితులకు నిర్మించిన 510 ప్లాట్లను పూర్తి చేసి వారికి అప్పగించాలన్నారు.

Updated Date - 2023-08-02T00:44:47+05:30 IST