అక్కిరెడ్డిపాలెంలో చోరీ
ABN , First Publish Date - 2023-03-28T01:41:23+05:30 IST
అక్కిరెడ్డిపాలెంలోని వివేకానందకాలనీలో తాళం వేసి వున్న ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. గాజువాక పోలీసులు, ఇంటి యజమాని బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
అక్కిరెడ్డిపాలెం, మార్చి 27: అక్కిరెడ్డిపాలెంలోని వివేకానందకాలనీలో తాళం వేసి వున్న ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. గాజువాక పోలీసులు, ఇంటి యజమాని బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వివేకానందకాలనీలో వుంటున్న పిళ్లా రమణ, చినతల్లి దంపతులు నేపాల్ పర్యటన నిమిత్తం ఈ నెల 24న ఇంటికి తాళం వేసి వెళ్లారు. కాగా ఆదివారం ఉదయం రమణ బంధువులు మొదటి అంతస్థులో వున్న రమణ ఇంటికి వెళ్లి చూడగా మెయిన్ డోర్ తాళం విరగొట్టి వుండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోని బీరువా తెరిచి వుండడాన్ని గుర్తించారు. బీరువాలోని లాకర్‌ను మాత్రమే తెరిచి అందులో వున్న వస్తువులు దొంగలు ఎత్తకుపోయినట్టు గుర్తించారు. అయితే బీరువా లాకర్‌లో ఏ వస్తువులు వున్నాయి, నగదు ఎంత వున్నది నేపాల్ నుంచి రమణ దంపతులు వస్తే గానీ తెలియదని పోలీసులు తెలిపారు. క్లూస్ టీమ్ వేలి ముద్రలు సేకరించారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.