ఆరోపణలపై జడ్పీటీసీ ఆధారాలు చూపాలి
ABN , First Publish Date - 2023-02-26T01:05:52+05:30 IST
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జగనన్న ఇళ్ల కాలనీ స్థలాలు అనర్హులకు ఇచ్చారని జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని వైసీపీ మండల నాయకులు డిమాండ్ చేశారు.
అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని జడ్పీ సమావేశంలో
దొండా రాంబాబు వ్యాఖ్యలు చేయడం తగదు
బుచ్చెయ్యపేట, ఫిబ్రవరి 25 : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జగనన్న ఇళ్ల కాలనీ స్థలాలు అనర్హులకు ఇచ్చారని జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని వైసీపీ మండల నాయకులు డిమాండ్ చేశారు. వైసీపీ మండల అధ్యక్షుడు కొల్లిమళ్ళ అచ్చెంనాయుడు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దేవర అప్పారావు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మరిసా నాని, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, వైసీపీ మండల వర్కింగ్ ప్రెసిడెండ్ నమ్మి అప్పలరాజు తదితరులు శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. అనర్హులకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాల వివరాలు, వడ్డాది లేఅవుట్‌లో 45మంది ఒక్కో కాలనీ ఇళ్ల స్థలాన్ని రూ.2 లక్షలు చొప్పున అమ్మేసుకున్నారన్న ఆరోపణలకు తగిన ఆధారాలను జడ్పీటీసీ రాంబాబు చూపాలని వారంతా పట్టుబట్టారు. ఎమ్మెల్యే ధర్మశ్రీకి చెడ్డపేరు తెచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. తగిన ఆధారాలు చూపకపోతే సహించేది లేదని వారంతా హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ నాగేశ్వరిదేవి భర్త దాకవరపు నాగేశ్వరరావు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.