ఈదురు గాలుల బీభత్సం

ABN , First Publish Date - 2023-05-26T01:03:45+05:30 IST

జిల్లాలో వరుసగా రెండో రోజైన గురువారం కూడా పలు మండలాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. గాలుల కారణంగా విద్యుత్‌ స్తంభాలు విరిగి పడడం, చెట్లు కూలి విద్యుత్‌ వైర్లపై పడడంతో గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మామిడి, అరటి, బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది. కాగా వాతావరణం చల్లబడడంతో వేసవి తాపం నుంచి ప్రజలు ఉపశమనం చెందారు.

ఈదురు గాలుల బీభత్సం
బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద కురుస్తున్న వర్షం

విగిరిపడిన విద్యుత్‌ స్తంభాలు

కరెంటు తీగలపై కూలిన చెట్లు

పలు మండలాల్లో గంటల తరబడి నిలిచిపోయిన కరెంటు సరఫరా

నేలరాలిన మామిడి కాయలు

గాలులకు పడిపోయిన అరటి, బొప్పాయి తోటలు

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

జిల్లాలో వరుసగా రెండో రోజైన గురువారం కూడా పలు మండలాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. గాలుల కారణంగా విద్యుత్‌ స్తంభాలు విరిగి పడడం, చెట్లు కూలి విద్యుత్‌ వైర్లపై పడడంతో గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మామిడి, అరటి, బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది. కాగా వాతావరణం చల్లబడడంతో వేసవి తాపం నుంచి ప్రజలు ఉపశమనం చెందారు.

చోడవరం మండలంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మెయిన్‌ రోడ్డుల్లోని గోతుల్లో నీరుచేరి చెరువులను తలపించాయి. ాహనదారులు ఇబ్బంది పడుతూ రాకపోకలు సాగించాల్సి వచ్చింది. సుమారు గంటపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. బుచ్చెయ్యపేట మండలంలో మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 3.45 గంటల వరకు ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. బుదిరెడ్లపాలెంలో కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది. చుట్టుపక్కల ఇళ్లలో పలు విద్యుత్‌, ఎలక్ర్టానిక్‌ పరికారాలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ వైర్లపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో నాలుగు గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దేవరాపల్లి మండలంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం వరకు వర్షం పడింది. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు కూలడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలుతో భారీ వర్షం కురిసింది. రెండు గంటలకుపైగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సాగరం-ఎం.కొడూరు గ్రామాల మధ్య రోడ్డు పక్కన వున్న చింతచెట్టు నేలకూలింది. దీంతో ట్రాఫికఖకు అంతరాయం ఏర్పడింది.

నర్సీపట్నం మునిసిపాలిటీతోపాటు మండలంలోని పలు ప్రాంతాల్లో గంటపాటు ఉరుములతో వర్షం కురిసింది. ఎస్‌.రాయవరం మండలంలోని సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. గాలుల కారణంగా విద్యుత్‌ నిలిచిపోయింది. రాత్రి 8.30 గంటలకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. ఎలమంచిలిలో గంటపాటు వర్షం కురిసింది. కొంతసేపు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. మాకవరపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మామిడి తోటల్లో కాయలు నేలరాలడంతో రైతులకు నష్టం వాటిల్లింది. పాయకరావుపేటలో సాయంత్రం ఐదు గంటల తరువాత ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంత ప్రజలు ఇబ్బందిపడ్డారు.

కోటవురట్ల మండలంలో గాలి, వాన బీభత్సం సృష్టించాయి. పాములవాక గ్రామంలో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగిపడిపోయాయి. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌పై చెట్లు పడడంతో తీగలు తెగిపోయి మధ్యాహ్నం రెండు గంటల నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈపీడీసీఎల్‌ సిబ్బంది రంగంలోకి దిగి మరమ్మతు పనులు చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటలకు కూడా కరెంటు సరఫరాను పునరుద్ధరించలేదు. దీంతో మండలం మొత్తం అంధకారం నెలకొంది.

Updated Date - 2023-05-26T01:03:45+05:30 IST