చవితి సందడి

ABN , First Publish Date - 2023-09-18T00:51:20+05:30 IST

వినాయక చవితి పండుగ నేపథ్యంలో పూజా సామగ్రి, పత్రి, వినాయక ప్రతిమలు, పండ్లు, పూలు వంటివి కొనుగోలు చేసేందుకు భక్తులు రావడంతో జిల్లాలో అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, చోడవరం, పాయకరావుపేట తదితర మార్కెట్‌లు కిటకిటలాడాయి. ఉదయం నుంచే కొనుగోలుదారులతో కిక్కిరిసి కనిపించాయి. అనకాపల్లి పట్టణంలోని నెహ్రూచౌక్‌, చిననాలుగురోడ్ల జంక్షన్‌, గవరపాలెం సంతోషిమాత ఆలయం ప్రాంతాలు రద్దీగా కనిపించాయి.

చవితి సందడి
అనకాపల్లిలో పూజా సామగ్రి కొనుగోలుదారులతో రద్దీగా వున్న నెహ్రూచౌక్‌ ప్రాంతం

కొనుగోలుదారులతో కిటకిటలాడిన మార్కెట్లు

పూజాసామగ్రి, పత్రి, ప్రతిమలు పండ్లు, పూలు భారీగా విక్రయాలు

యథావిధిగా ఆశాన్నంటిన ధరలు

అనకాపల్లి టౌన్‌/ నర్సీపట్నం/ ఎలమంచిలి, సెప్టెంబరు 17:

వినాయక చవితి పండుగ నేపథ్యంలో పూజా సామగ్రి, పత్రి, వినాయక ప్రతిమలు, పండ్లు, పూలు వంటివి కొనుగోలు చేసేందుకు భక్తులు రావడంతో జిల్లాలో అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, చోడవరం, పాయకరావుపేట తదితర మార్కెట్‌లు కిటకిటలాడాయి. ఉదయం నుంచే కొనుగోలుదారులతో కిక్కిరిసి కనిపించాయి. అనకాపల్లి పట్టణంలోని నెహ్రూచౌక్‌, చిననాలుగురోడ్ల జంక్షన్‌, గవరపాలెం సంతోషిమాత ఆలయం ప్రాంతాలు రద్దీగా కనిపించాయి. నర్సీపట్నంలో పాల్‌ఘాట్‌ సెంటర్‌ నుంచి అబీద్‌ సెంటర్‌ వరకు మెయిన్‌ రోడ్డుకి ఇరువైపులా పత్రి, గణపతి ప్రతిమలు, పండ్లు, పూల దుకాణాలు ఏర్పాటు చేశారు. స్థానికులతోపాటు చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలు రావడంతో రహదారులు రద్దీగా మారి ట్రాఫిక్‌ స్తంభించింది. వినాయక చవితి సామగ్రి కొనుగోలుదారులతో ఎలమంచిలి ప్రధాన రహదారి ఆదివారం సాయంత్రం రద్దీగా మారింది. కాగా వినాయక పూజా పత్రి కట్ట రూ.20, అరటి ఆకు రూ.20, కొబ్బరికాయ ఒకటి రూ.20 నుంచి రూ.30, అరటి పండ్లు డజను రూ.60 నుంచి రూ.70, పూజలో వినియోగించే ఐదు ఫలాలు రూ.50, వినాయక మట్టి ప్రతిమలు చిన్నవి రూ.30-40లకు విక్రయించారు. పూల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. డజను చామంతి పూలు రూ.25, గులాబీలు రూ.30, బంతిపూల దండ రూ.50 చొప్పున అమ్మారు.

-----

రైటప్‌17వైఎల్‌ఎమ్‌7: అంకుడు కర్రతో సూక్ష గణనాథుడిని తయారు చేసిన హస్తకళాకారిణి చింతల లావణ్య

రైటప్‌17వైఎల్‌ఎమ్‌7: (ఇన్‌సెట్‌లో) ఒక అంగుళం ఎత్తు, అర అంగుళం వెడల్పుతో రూపొందించిన సూక్ష గణనాథుడు

అంకుడు కర్రతో సూక్ష్మ గణనాథుడు

ఏటికొప్పాక హస్త కళాకారిణి లావణ్య ప్రతిభ

ఎలమంచిలి, సెప్టెంబరు 17: ఎలమంచిలి మండలం ఏటికొప్పాకకు చెందిన హస్తకళాకారిణి చింతల లావణ్య వినాయక చవితి పండుగ సందర్భంగా అంకుడు కర్రతో సూక్ష గణనాథుడిని తయారు చేశారు. ఒక అంగుళం ఎత్తు, అర అంగుళం వెడల్పుతో చేతి బొటన వేలు గోరుపై నిలిపేటంత చిన్న బొమ్మను రూపొందించారు. దీనిని తయారు చేయడానికి రెండు రోజులు పట్టిందని ఆమె తెలిపారు. ఏటికొప్పాకలో మగ కళాకారులకు ఏమాత్రం తీసిపోకుండా మహిళలు కూడా అంకుడు కర్రతో సూక్ష కళారూపాలను తయారు చేస్తారని లావణ్య నిరూపించారు. ఎస్‌.రమణ వద్ద కొంతకాలంపాటు శిక్షణ తీసుకుని తరువాత సొంతంగా బొమ్మలు తయారు చేస్తున్నానని, రానున్న రోజుల్లో సీనియర్‌ కళాకారుల సూచనలతో అరుదైన కళాఖండాలను రూపొందిస్తామని ఆమె చెప్పారు.

Updated Date - 2023-09-18T00:51:20+05:30 IST