ఇంటర్ విద్యార్థుల మార్కుల జాబితా వచ్చాయ్
ABN , First Publish Date - 2023-10-08T01:12:20+05:30 IST
ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించిన ఒరిజనల్ మార్కుల జాబితాలు జిల్లాకు వచ్చాయని ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఆర్.సత్యనారాయణ తెలిపారు.
నేడు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లు వచ్చి తీసుకువెళ్లవచ్చు: ఆర్‌ఐవో
విశాఖపట్నం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి):
ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించిన ఒరిజనల్ మార్కుల జాబితాలు జిల్లాకు వచ్చాయని ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఆర్.సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లు లేదా ప్రిన్సిపాళ్ల అథరైజేషన్ సర్టిఫికెట్‌తో కళాశాలల సిబ్బంది ఆదివారం ఉదయం మద్దిలపాలెంలో తమ కార్యాలయానికి వచ్చి మార్కుల జాబితాలు తీసుకువెళ్లాలని ఆయన కోరారు. కళాశాలలకు మార్కుల జాబితాలు తీసుకువెళ్లిన వెంటనే విద్యార్థులకు అందజేయాలని ఆదేశించారు. ఇంకా మార్కుల జాబితా సాఫ్ట్ కాపీ కోసం ప్రతి విద్యార్థి మొబైల్ ఫోన్ నుంచి డీజీ లాకర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి ఒరిజినల్ మార్కుల జాబితాతోపాటు యాప్ ద్వారా సాఫ్ట్ కాపీ పొందేందుకు ఈ యాప్ దోహదపడుతుందన్నారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసే విధానం ఆదివారం ఆర్‌ఐవో కార్యాలయంలో వివరిస్తామన్నారు.