‘యువగళం’ ముగింపు సభను సక్సెస్ చేయాలి
ABN , Publish Date - Dec 18 , 2023 | 01:00 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు కార్యక్రమం సోమ వారం జరగనున్నదని, దీనిని విజయవంతం చేయవల సిందిగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోరారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
గాజువాక, డిసెంబరు 17: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు కార్యక్రమం సోమ వారం జరగనున్నదని, దీనిని విజయవంతం చేయవల సిందిగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోరారు. గాజువాకలోని పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు కోట్ల మంది రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. పార్టీ రాష్ట్ర పరిశీలకుడు వి.బాబ్జీ మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. జనసేన గాజువాక ఇన్‌చార్జి కోన తాతారావు మాట్లాడుతూ యువగళం పాదయాత్ర ముగింపు, 20న సారిపల్లిలో జరగనున్న ఎన్నికల శంఖారావ సభను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు బొండా జగన్, పల్లా శ్రీనివాసరావు, దల్లి గోవిందరెడ్డి నాయకులు ప్రసాదుల శ్రీనివాస్, అప్పారావు, వెంకటరావు, తిప్పల రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
లోకేశ్‌ను స్వాగతించేందుకు బైక్ ర్యాలీ
పెదగంట్యాడ: యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్‌కు దేశపాత్రునిపాలెం వద్ద ఘనంగా స్వాగతించేందుకు ఆదివారం సాయంత్రం టీడీపీ పెదగంట్యాడ మండల నాయకులు బైక్ ర్యాలీతో తరలివెళ్లారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పులి వెంకటరమణారెడ్డి, నాయకులు పి.సోమునాయుడు, నమ్మి అప్పారావు, ఎస్.శ్రీనివాసరావు, ఎం.పెంటయ్య, జి.పోలయ్య, కె.సన్యాసమ్మ, సరోజని, తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.
తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు
కూర్మన్నపాలెం: నారా లోకేశ్‌లో కలిసి యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు తెలుగు తమ్ముళ్లు తరలి వెళ్లారు. ఈ మేరకు ర్యాలీని 88వ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు ఉరుకూటి శ్రీను, జి.శివకుమార్, ఎస్.పైడిరాజు, రాము, ఎర్నిబాబు, సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.
లోకేశ్ బసకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు శివాజీ నగర్ పైలాన్ వద్ద నిర్వహించనున్న నేపథ్యంలో వడ్లపూడి పెట్రోల్ బంక్ వద్ద ఖాళీ స్థలాలను ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్ పరిశీలించారు. లోకేశ్ బసకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నాయకులు నల్లూరు సూర్యనారాయణ, వి.శ్రీనివాస్, ఎం.కనకరాజు, ఎం.రాము, తదితరులు పాల్గొన్నారు.